వైరల్ అవుతున్న ఫ్యాన్స్ పై బన్నీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ! |

ప్రదీప్‌ వర్మ దర్శకత్వంలో హీరో శ్రీవిష్ణు హీరోగా రాబోతున్న సినిమా ‘అల్లూరి’. ఈ సినిమా ఈ నెల 23న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన వేడుకకు అల్లు అర్జున్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బన్నీ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఎవరికైనా అభిమానులుంటారు. నాకు మాత్రం ఆర్మీ ఉంది. నన్ను ప్రాణంగా ప్రేమించే నా ఆర్మీ.. ఐ లవ్‌ యూ’’ అని అల్లు అర్జున్‌ అన్నారు. బన్నీ ఇలా అనడంతో బన్నీ ఫ్యాన్స్ కేరింతలతో ప్రాంగణం అంతా హోరెత్తించారు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా ఈ కామెంట్స్ ను బన్నీ ఫ్యాన్స్ తెగ షేర్ అండ్ లైక్ చేస్తూ హడావిడి చేస్తున్నాడు. బన్నీ కి ఫ్యాన్స్ పై విపరీతమైన ప్రేమ ఉందని.. అభిమానులను ఇంతలా గౌరవించే హీరో మరొకరు ఉండరు అని కామెంట్స్ పెడుతూ బన్నీ పై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఇక అల్లూరి సినిమా విషయానికి వస్తే.. లక్కీ మీడియా బ్యానర్‌పై బెక్కెం వేణుగోపాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు, బెక్కెం బబిత ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.

Supply hyperlink

Leave a Comment