నాకు ఎంతో ఇష్టమైన వ్యక్తి శ్రీవిష్ణు గారి అల్లూరి సూపర్ హిట్ కొట్టాలి – అల్లూరి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ |

టాలీవుడ్ లో పలు వైవిధ్యమైన సినిమాలతో ప్రస్తుతం దూసుకెళ్తున్న నటుడు శ్రీవిష్ణు. ఆయన నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ పవర్ఫుల్ మూవీ అల్లూరి. ఆయన పోలీస్ అధికారిగా కనిపిస్తున్న ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్ ని ఇటీవల నాని విడుదల చేసారు. కాగా ట్రైలర్ కి అందరి నుండి సూపర్ గా రెస్పాన్స్ వచ్చింది. లక్కీ మీడియా బ్యానర్ పై బెక్కం వేణుగోపాల్ నిర్మించిన ఈ మూవీకి ప్రదీప్ వర్మ దర్శకుడు. ఇక ఈ మూవీ యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నేడు హైదరాబాద్ లోని ఎన్ కాన్వేషన్ సెంటర్ లో గ్రాండ్ గా నిర్వహించారు.

ఈ ఈవెంట్ కి టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్ గా విచ్చేసారు. ఇక ఈవెంట్ లో అల్లు అర్జున్ మాట్లాడుతూ, ముందుగా ఇక్కడికి వచ్చిన తన ఫ్యాన్స్ కి, అలానే శ్రీవిష్ణు గారి ఫ్యాన్స్, వెల్ విషర్స్ కి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పారు అల్లు అర్జున్. ఇక శ్రీవిష్ణు గారి ఫస్ట్ మూవీ ప్రేమ ఇష్క్ కాధల్ లో ఆయన యాక్టింగ్ తనకు విపరీతంగా నచ్చిందని, అందుకే అటువంటి గొప్ప టాలెంట్ ఉన్న వ్యక్తి మంచి కంటెంట్ కలిగిన మూవీస్ సెలెక్ట్ చేసుకుంటే కెరీర్ మరింతగా బాగుంటుందని సలహా ఇచ్చాను అన్నారు. అక్కడి నుండి ఆయన చేసిన ప్రతి మూవీ తాను చూశానని, మధ్యలో కొన్ని కమర్షియల్ గా సక్సెస్ కానప్పటికీ కూడా ప్రతి సినిమాలో ఆయన నటనని మరింతగా ఇంప్రూవ్ చేసుకుంటూ కొనసాగుతున్నారన్నారు.

ఇక ప్రస్తుతం ఆయన నటిస్తున్న పవర్ఫుల్ పోలీస్ అధికారి కథ అల్లూరి కోసం తన ఇంటికి వచ్చి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఆహ్వానించగానే వెళ్ళాలి అనిపించి వెంటనే ఒప్పుకున్నానన్నారు. హీరోయిన్ కయడు లోహర్ కి అలానే నిర్మాత వేణుగోపాల్ గారికి, దర్శకుడు ప్రదీప్ వర్మ గారికి, అలానే యావత్ యూనిట్ మొత్తానికి తన తరపున బెస్ట్ విషెస్ అని, మంచి మనస్సుగల శ్రీవిష్ణు గారి అల్లూరి తప్పకుండా పెద్ద సక్సెస్ అందుకోవాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు అల్లు అర్జున్. కాగా ఈ మూవీ సెప్టెంబర్ 23న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Supply hyperlink

Leave a Comment