తమిళంలో విడుదల కానున్న తమన్నా తొలి తెలుగు వెబ్ సిరీస్! |

మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా యొక్క మొదటి తెలుగు వెబ్ సిరీస్ 11త్ అవర్ మళ్ళీ వార్తల్లో నిలిచింది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన ఈ సిరీస్ ఏప్రిల్ 2021లో ఆహాలో విడుదలైంది. ఇప్పుడు ఈ సిరీస్‌ని తమిళంలోకి డబ్ చేయనున్నారు మేకర్స్.

ఆహా దాని సోషల్ మీడియా ప్రొఫైల్‌ ల ద్వారా త్వరలో తమిళంలో కూడా ప్రసారం చేయనున్నట్లు ప్రకటించడం జరిగింది. కచ్చితమైన విడుదల తేదీ రానున్న రోజుల్లో వెల్లడి కానుంది. ఈ వెబ్ సిరీస్ లో ఆదిత్ కూడా ఉన్నాడు అరుణ్, వంశీకృష్ణ, శత్రు తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

Supply hyperlink

Leave a Comment