ఆ విషయం లో అడివి శేష్ ను ఫాలో అవుతున్న దుల్కర్ సల్మాన్! |

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో దుల్కర్ సల్మాన్ ప్రస్తుతం తన చివరి వెంచర్ సీతా రామం గ్రాండ్ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ శుక్రవారం, నటుడి కొత్త హిందీ చిత్రం చుప్ థియేటర్ల లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఆర్ బాల్కీ రచన మరియు దర్శకత్వం వహించిన ఈ చిత్రం అధికారిక విడుదలకు ముందే ప్రేక్షకులకు ప్రత్యేకంగా ప్రదర్శించబడుతుంది. అడివి శేష్ తన చివరి సినిమా మేజర్ కోసం అనుసరించిన అదే వ్యూహాన్ని చుప్ మేకర్స్ అనుసరించారు.

అడివి శేష్ ఎంపిక చేసిన నగరాల్లోని ప్రేక్షకుల కోసం ప్రీమియర్‌లను ప్రదర్శించాలనే ఆలోచనతో ముందుకు వచ్చారు మరియు దీనికి అద్భుతమైన స్పందన వచ్చింది. సెప్టెంబర్ 20, 2022 న ముంబై, హైదరాబాద్, గుర్గావ్, బెంగళూరు, పూణే, ఢిల్లీ, అహ్మదాబాద్, లక్నో, జైపూర్ మరియు కోల్‌కతా లో చుప్ చిత్రం కి సంబంధించిన ప్రీమియర్‌లు ప్రదర్శించబడతాయి. సన్నీ డియోల్, శ్రేయా ధన్వంతరి, పూజా భట్ లు కీలక పాత్రల్లో నటించగా, పెన్ స్టూడియోస్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. ఈ చిత్రానికి అమిత్ త్రివేది సంగీతం అందించారు.

Supply hyperlink

Leave a Comment