“ఆర్‌ఆర్‌ఆర్‌ ఫర్‌ ఆస్కార్‌” ట్రెండింగ్‌ కి కారణం ఇదే! |

SS రాజమౌళి దర్శకత్వం వహించిన టాలీవుడ్ ఎపిక్ బ్లాక్‌బస్టర్ RRR భారతదేశం లోనే కాకుండా పాశ్చాత్య దేశాలలో కూడా విమర్శకులు మరియు ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ ను అందుకుంది. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ పాత్రల్లో నటించిన ఈ సినిమా ఇప్పుడు ఆన్‌లైన్‌లో ట్రెండ్ అవుతోంది. వెరైటీ మ్యాగజైన్ విడుదల చేసిన ఆస్కార్ అంచనాల జాబితాలో RRR హైలైట్ గా నిలిచిన సంగతి అందరికీ తెలిసిందే.

ఆస్కార్‌కి ఈ చిత్రం ఎంట్రీ పై అంచనాలు పెరిగాయి. ఇప్పుడు, ఆర్‌ఆర్‌ఆర్ ఫర్ ఆస్కార్ ట్యాగ్ ట్విట్టర్‌లో ట్రెండింగ్‌లో ఉంది, ఎందుకంటే భారత ప్రభుత్వం ఆర్‌ఆర్‌ఆర్‌ని అకాడమీ అవార్డులకు అధికారిక ప్రవేశంగా పరిగణించవచ్చని అభిమానులు భావిస్తున్నారు. ఈ వారంలో అధికారిక ఎంట్రీని ప్రకటించే అవకాశం ఉంది. మరి సినిమాని ప్యానెల్ ఎంపిక చేస్తుందో లేదో వేచి చూడాలి. RRR లో అలియా భట్, ఒలివియా మోరిస్ లు హీరోయిన్స్ గా నటించగా, శ్రియ శరణ్, అజయ్ దేవగన్, సముద్ర ఖని, రాహుల్ రామకృష్ణ లు కీలక పాత్రల్లో నటించారు. డివివి దానయ్య భారీ స్థాయిలో నిర్మించిన ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సౌండ్‌ట్రాక్‌లు అందించారు.

Supply hyperlink

Leave a Comment